3 July, 2026 | 6:13 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఇల్లందులో "విలేఖరి"పై దాడి

18-10-2024 08:20 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): మారణ ఆయుధాలతో విలేకరుపై దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటుచేసుకుంది. ఎన్. సుదర్శన్ అనే విలేకరుపై కొంతమంది దుండగులు మారణయుధాలతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వేలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు చేసిన దాడిలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన  చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. అయితే సుదర్శన్ పై దాడి పాత కక్షల నేపథ్యంలోనే జరిగి ఉంటుందని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడికి సంబంధించి ఇల్లందు జర్నలిస్టులతో పాటు జర్నలిస్టు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలోను ఈ దాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు సైతం పాత్రికేయులు, కుటుంబీకులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్  ప్రభుత్వం హయాంలోనూ సుదర్శన్ కు పలు తగాదాలు ఉన్నట్లు ఆ కోణంలోనూ దాడి జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. విలేఖరి పై దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.