3 July, 2026 | 5:14 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

వ్యవసాయ శాఖలో నూతన ఏఓల రాక

18-10-2024 08:04 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో మండల వ్యవసాయ అధికారులు చేరికతో జిల్లా వ్యవసాయ శాఖ నిండుగా కనిపిస్తోంది. జిల్లాలోని చెన్నూర్ మండల వ్యవసాయ అధికారిగా యామిని, తాండూరుకు సుష్మా, భీమారానికి అత్తె సుధాకర్, కన్నెపల్లికి సాయి ప్రశాంత్, కోటపల్లికి సాయి కృష్ణా రెడ్డి, భీమినికి యమున దుర్గా, నెన్నెల మండల వ్యవసాయాధికారిగా సృజనలతో పాటు డీఏఓ కార్యాలయ టెక్నికల్ ఏవోలుగా ఫర్హాన్, తరుణ్ లు శుక్ర వారం బాధ్యతలు తీసుకున్నారు. ఖాళీల స్థానంలో ఏఓలు రావడంతో రైతులకు సాగులో మెరుగైన సలహాలు, సూచనలు అందనున్నాయి.