జేఎన్యూలో విద్యార్థులపై దాడి హేయమైన చర్య: ఎస్‌ఎఫ్‌ఐ
27-02-2026 08:23 PM
దేవరకొండ,(విజయక్రాంతి): జేఎన్యూలో విద్యార్థులపై దాడి హేయమైన చర్య అని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతోనే క్యాంపస్‌లలో మత విధ్వంశాలు స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. ముసుగులు ధరించి విద్యార్థినుల హాస్టళ్లలోకి చొరబడి, ఇనుప రాడ్లతో దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క మొక్క గణేష్, చీమట శివ, జైరాం, అరవిందు, ప్రశాంతు, సంపత్, కొండల్, మహేష్, గంగరాజు, సాయిరాం, అభిషేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




