14 July, 2026 | 10:50 AM

ముగ్గరు ముష్కరులు హతం

27-06-2024 12:10 AM

జమ్ముకశ్మీర్‌లో మట్టుబెట్టిన బలగాలు

న్యూఢిల్లీ, జూన్ 26: జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు ముగ్గురు ఉగ్ర వాదులను ఎన్‌కౌంటర్ చేశాయి. దో డా జిల్లా భదేర్వాహ్ సెక్టార్‌లోని గందోహ్ వద్ద బుధవారం చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు జమ్ము ఏడీజీపీ విజయ్‌కుమార్ ప్రకటించారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు స్వాధీ నం చేసుకొన్నట్టు వెల్లడించారు. వీటిలో అమెరికాలో తయారయ్యే అత్యాధునిక ఎం4 కార్బైడ్ ఉండటం విశేషం. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులు ఈ నెల 11న పోలీసులు, సైన్యంపై దాడిచేసిన బృందంలో సభ్యులేనని అనుమానిస్తున్నారు.