ఈడీపై దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
29-05-2026 12:43 AM
- 300 మందిపై కేసు నమోదు
- కేరళం డీజీపీ రవాడ చంద్రశేఖర్
తిరువనంతపురం, మే 28: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడులు చేసిన వారిలో ఎనిమిది మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న 300మందిపై కేసులు నమోదు చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారని కేరళం డీజీపీ రవాడ ఏ చంద్రశేఖర్ గురువారం మీడియాకు వివరించారు. 300మందిలో కొంతమందిని గుర్తించామని, త్వరలోనే మిగతావారిని కూడా అదు పులోకి తీసుకుంటామని తెలిపారు. వివిధ సెక్షన్ల కింద, బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీజీపీ స్పష్టం చేశారు.






