29 May, 2026 | 2:53 AM

టీఎంసీ నేత పొలంలో 2.24 కోట్లు

29-05-2026 12:37 AM
  1. తవ్వకాల్లో  ట్రాలీ బ్యాగులు, సంచుల్లో నోట్లకట్టలు
  2. ఆ బ్యాగులను మోసుకెళుతున్న వీడియోలు వైరల్
  3. పోలీసు జాగిలాలు, డ్రోన్ కెమెరాలతో ఆపరేషన్
  4. బంగాల్‌లో కదులుతున్న దీపాంకర్ అవినీతి డొంక

కోల్‌కతా, మే 28: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత, బదురియా మున్సిపాలిటీ చైర్మన్ దీపాంకర్ భట్టాచార్య పొలంలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉత్తర 24 పరగణా జిల్లాలోని బటుల్ దంగాలో భట్టాచార్య ఫాంహౌస్‌కు ఆనుకొని ఉన్న పొలం నుంచి ఈ నగదును పట్టుకున్నారు. దీంతో దీపాంకర్ భట్టాచార్య అవినీతి డొంక కదులుతోంది. పోలీసు జాగిలాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ఆపరేషన్ చేపట్టారు. పొలంలో గంటల తరబడి తవ్వకాలు జరిపగా, నోట్లతో నింపిన సంచులు, ట్రాలీ బ్యాగులు బయట పడ్డాయి. ఆ బ్యాగుల్లో నగదుతోపాటు పలు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

బ్యాగులను పోలీసులు భుజా న పెట్టుకొని మోసుకుంటూ వెళ్లడంతో అక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన స్థానికులు నోరె ళ్లబెట్టారు. ఈ వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మే 24వ తేదీ రాత్రి టీఎంసీ కార్యాలయం నుంచి అనుమానాస్పదంగా వస్తువులను వ్యాన్లలో తరలించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో పొలంలో సోదాలు చేపట్టారు. వరద బాధితులకు అందజేయాల్సిన నగదు, టార్ఫాలిన్ షీట్ల దుర్విని యోగం ఆరోపణలపై పోలీసులు భట్టాచార్య నివాసంలో చేసిన సోదాల్లో రూ.80 లక్షలు, 4వేల టార్ఫాలిన్ షీట్లను స్వాధీనం చేసునకున్నారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.