30 March, 2026 | 12:11 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

గుడుంబా స్థావరాలపై దాడులు

19-09-2025 12:11 AM

ఆరుగురిపై కేసు నమోదు

నర్సంపేట, సెప్టెంబర్18 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్న రావు ఆదేశాల మేరకు నాటు సారా నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గురువారం నల్లబెల్లి మండలం నందిగామ, రేలకుంట గ్రామాలలో నాటుసార  (గుడుంబా) స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 1900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది.

గుడుంబా నిర్మూలన ప్రధమ కర్తవ్యం అని అధికారులు వెల్లడించారు. ఈ దాడులలో వరంగల్ రూరల్ అసిస్టెంట్ ఎక్సైజ్  సూపరిండెంట్ మురళీధర్, వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్  సూపరిండెంట్  శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, వరంగల్ రూరల్ టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగయ్య, ఎస్త్స్రలు రమ, శిరీష, స్థానిక పోలీస్ ఎస్‌ఐ గోవర్ధన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.