calender_icon.png 19 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపత్కాలంలో అండగా 108, 102 సేవలు

19-09-2025 12:10:09 AM

960 ప్రాణాలు కాపాడిన ముల్కనూరు అంబులెన్స్ సేవలు

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి); హనుమకొండ జిల్లాభీమదేవరపల్లిమండలంలోని ముల్కనూర్ పీహెచ్సీ పరిధిలో 108, 102 అంబులెన్స్ సేవలు అత్యుత్తమంగా కొనసాగుతున్నాయని జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం ఆయన అంబులెన్స్లలో అత్యవసర వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. జనవరి నుండి ఆగస్టు వరకు 108 సేవల ద్వారా 960 మంది ప్రాణాలను రక్షించగలిగామని ఆయన తెలిపారు.

ఈ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందిని అభినందించారు. వర్షా కాలంలో వ్యాధులు విస్తరించే సందర్భంలో 108 సేవలను సకాలంలో వినియోగించు కోవాలని ప్రజలకు సూచించారు. ఫోన్ రాగానే 30 సెకన్లలో బయలుదేరి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే 102 అంబులెన్స్ సేవలు గర్భిణీ స్త్రీలకు గర్భధారణ నుండి డెలివరీ వరకు ప్రతి నెలా హాస్పిటల్ చెకప్ కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాయని తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యే స్త్రీలు చంటి పాపతో సహా తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకు అయినా ఉచితంగా ఇంటి వరకు చేర్చబడతారని వివరించారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాలను తెచ్చుకోవద్దని జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటి మేకల రవి, పైలట్ కృష్ణంరాజు, సుధాకర్ పాల్గొన్నారు.