19-09-2025 12:12:04 AM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 18:వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందని, కావున రైతులు అప్రమత్తంగా ఉంటూ దగ్గరికి వెళ్లే క్రమంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వ్యవసాయ పంట పొలాలలో విద్యుత్ ప్రమాదాల నివారణ గురించి వనపర్తి జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల ఎస్త్స్రలతో దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ...
వనపర్తి జిల్లాలో రైతులు తమ వ్యవసాయ పొలాలో పంటలను పండించుకునేందుకు విద్యుత్ మోటర్లను ఏర్పాటు చేసుకుంటారు. వర్షాకాలం అయినందుకు తడిగా ఉండడం గమనించక రైతులు విద్యుత్ షాక్ తో ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో 11 మంది రైతులు మరణించారు.
కుటుంబ యజమాని మృత్యువాత పడడంతో కుటుంబాలు రోడ్డున పడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కావున జిల్లాలో వ్యవసాయ రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో విధిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యుత్ ప్రమాద మరణాల నుంచి రైతులను కాపాడాలని ఎస్పీ తెలిపారు.