‘ఉషా బాల’ బాలల మాస పత్రిక ఆవిష్కరణ
డాక్టర్ గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఒంగోలు, ఏప్రిల్ 11: ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు బాలలు -2026 సందర్భంగా ఆంధ్రశ్రీ పురస్కార గ్రహీత, ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ శరత్ చంద్ర సంపాదకత్వం లో రూపొందుకున్న బాల బాలల మాస పత్రిక ‘ఉషా బాల’ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించగా, తొలి ప్రతిని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కి అందజేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించే నాలుగవ ప్రపంచ తెలు గు మహా సభలు - బాలలు -2026ను అంద రం కలిసి గొప్పగా విజయవంతం చేయాలని, ప్రకాశం జిల్లా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించడానికి మా సహ కారం ఉంటుందని ఎంపీ, ఎమ్మెల్యే అన్నా రు.
40 దేశాల నుంచి బాల బాలికలు ప్రతినిధులుగా వస్తున్నారని, తెలుగు సంస్కృతి లోని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు బాలబాలికలు ప్రదర్శన చేస్తున్నట్లు, వారే మహా సభలు నిర్వహించేటట్లుగా వారిని తీర్చి దిద్దుతున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహా సభలకు ఆతిథ్య మివ్వడానికి ముందుకు వచ్చిన నెకస్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ మురళీధర్ రెడ్డి, శ్రీ కోగంటి శ్రీకాంత్‌లను అతిథులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు సాహితీ ప్రముఖులు పొన్నూరు శ్రీనివాస్, కొండారెడ్డి, ఎమ్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.




