15 June, 2026 | 8:05 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం

10-05-2026 01:15 AM

నిందితులు అరెస్టు, రిమాండ్

ఘట్‌కేసర్, మే 9 (విజయక్రాంతి): ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై చాకుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం చౌదరిగుడ విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత (36) అనే మహిళ అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్ (40) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియునితో కలిసి ఆమె ఇంటిలో నాలుగు స్పై కెమెరాలు పెట్టించి భర్త రమావత్ బిక్కు కదలికలు ఎప్పటికప్పుడు మంగిలాల్ గమనిస్తూ సుజాతను ఆమె భర్త బిక్కుతో కాపురం చేయవద్దని చెప్పాడు. 

సుజాత ప్రవర్తన మీద అనుమానం వచ్చిన ఆమె భర్త బిక్కు ఆమెను గట్టిగ మందలించాడు. వారి అక్రమ సంబంధానికి ఆమె భర్త అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపి అడ్డు తొలిగించుకోవాలని ఆమె భర్త బిక్కుపై చాకుతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. భార్య రమావత్ సుజాత, ప్రియుడు జటోతు మంగిలాల్ మీద భర్త బిక్కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు వారి పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.