10 May, 2026 | 2:39 AM

ప్రధాని సభకు రావాలని బైక్ ర్యాలీ

10-05-2026 01:17 AM

సికింద్రాబాద్, మే 9 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నేడు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరం గ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావారలని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త, బీజేపీ నాయకులు రామ్ వెంకటేష్  తార్నాక నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు వందమంది కార్యకర్తలతో తార్నాక నుంచి ఓయూ, విద్యానగర్ మీదుగా ఎక్స్ రోడ్డుకు చేరుకుని ఎక్స్ రోడ్డులో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ పాల్గొంటున్న బైక్ ర్యాలీ నిర్వహించారు.

అంతకు ముందు ఆయన తార్నాకలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అంటే మోదీ అంటే అభివృద్ధి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని,రాష్ట్ర అభివృద్దికి ప్రధాని అనేక కార్యక్రమాలు చేపట్టి  ప్రగతిపథంలో నిలిపారన్నారు. నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే మహాసభలో  ప్రధాని సుమారు రూ. 7,823 కోట్ల భారీ ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ భవిష్యత్తును మార్చబోతు న్నారని అన్నారు. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ, కొత్త హైవే లు, మల్కాపూర్ వేల సంఖ్యలో రాబోయే ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకు సాగుతన్నారని, ఈ అభివృద్ధి యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యమవుదామని మోదీకి  ఘనస్వాగతం పలుకుదామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.