calender_icon.png 9 February, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో విద్యార్థులకు గేమింగ్ ఇండస్ట్రీ కెరీర్ అవగాహన

09-02-2026 04:18:44 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం, మెటావర్స్ గేమింగ్ క్లబ్ సహకారంతో మెటా మెహమ్–గేమింగ్ ఇండస్ట్రీ అండ్ కెరీర్ అవగాహన అనే రెండు రోజుల కార్యక్రమాన్ని డి-బ్లాక్ మానస్ ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించింది. ఈకార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు గేమింగ్ రంగం కేవలం వినోదానికి మాత్రమే కాకుండా ఒక సంఘటిత, వృత్తిపరమైన కెరీర్-ఆధారిత రంగంగా అభివృద్ధి చెందిందని అవగాహన కల్పించడం ఉన్నారు.

గేమ్ డెవలప్‌మెంట్, గేమ్ డిజైన్, ఈ-స్పోర్ట్స్, కంటెంట్ క్రియేషన్, గేమింగ్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న కెరీర్ అవకాశాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం అని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

మొత్తం150 మంది విద్యార్థులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ. 9,000 నగదు బహుమతులు పంపిణీ చేయబడ్డాయి. ప్రతి గేమ్‌కు రూ. 3,000 బహుమతి ఉండగా, మొదటి బహుమతి రూ. 2,000, రెండవ బహుమతి రూ. 1,000గా అందజేశారు. విజేతలను డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి బహుమతులు అందించి సత్కరించారు.