calender_icon.png 2 November, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చియ్యమ్మ వచ్చేసింది!

02-11-2025 01:01:18 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇందులో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదవలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా మేకర్స్ కథానాయకి జాన్వీకపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆమెను ‘అచ్చియ్యమ్మ’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన రెండు డిఫరెంట్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో సన్‌గ్లాసెస్‌తో స్టులిష్‌గా మైక్ ముందు ధైర్యంగా నిలబడి ఉంది.

రెండో పోస్టర్‌లో జీప్‌పై నిలబడి, అభివాదం చేస్తూ కనిపించింది. ఫియర్స్ అండ్ ఫియర్‌లెస్ అనే టైటిల్‌కి తగినట్లు ఈ పోస్టర్లలో జాన్వీ పూర్తిగా మాసీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. 2026 మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.