30 July, 2026 | 1:14 AM

ఔరా.. ఔలీ!

26-05-2024 02:57 AM

ఉత్తరాఖండ్, మే 25: ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతాన్ని భారతదేశ స్కీ రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ నుంచి హిమాలయాలు సుందరంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలుగా పేరొందిన నందాదేవి, త్రిశూల్ పర్వత్, హాథీ, ఘోడా వంటివాటిని ఇక్కడనుంచి చూడవచ్చు. ఇక్కడకి వచ్చే పర్యాటకులు హిమాలయాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడంతో పాటు స్కీయింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ కోసం ఎక్కువ గా వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ రోప్ వే రైడింగ్ కూడా ఉంది. అడ్వెంచర్ ఇష్టపడే యాత్రికులకు బెస్ట్ ప్లేస్.