30 July, 2026 | 2:03 AM

రాంచీలో ఓటు వేసిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

26-05-2024 02:48 AM

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం  రాంచీలో సాధా రణపౌరుడిలా  క్యూలో నిలబడి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సామాన్యులైనా, గౌరవ ప్రదమైన పదవిలో ఉండే వ్యక్తులెవరైనా సరే ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ప్రజా స్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పేర్కొన్నారు.