30 July, 2026 | 12:23 AM

మైమరిపించే బీచ్

26-05-2024 03:00 AM

మహారాష్ట్ర, మే 25: సాధారణంగా పెద్ద బీచ్‌లు అంటే నగరాలకు సమీపంలో ఉంటాయి. కానీ, మహారాష్ట్రలో పరులే బీచ్ మీకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. పొలాల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తోటలు, ఆవుల మధ్య బస చేయొ చ్చు. బీచ్‌లో చిల్ అవ్వొచ్చు. చేపలు పట్టవచ్చు. బోట్ రైడింగ్ చేయొచ్చు. ప్రకృతి సహజ అందాలు మైమరిపిస్తాయి. వీటికి మించి ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో థ్రిల్ చేస్తుంది. వీటితో పాటు చుట్టూ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు.