25 March, 2026 | 4:51 PM

అవినీతి వివోఏపై అధికారులు చర్యలు తీసుకోవాలి

25-03-2026 03:48 PM

వేములపల్లి,(విజయక్రాంతి): వేములపల్లి మండల పరిధిలోని లక్ష్మీదేవిగూడెం విఓఏ ముత్యాల సరిత అవినీతి చేస్తుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని సంఘం  సభ్యులు బుధవారం విలేకరుల సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో కలెక్టర్ గారికి ఆమె అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జనవరి 30వ తారీఖున సిసి, ఏపిఎం, బి పి యం లు మా గ్రామానికి వచ్చి విచారణ జరిపినారు. ఈ విచారణలో విఓఏ తప్పు చేసిందని తేలినప్పటికీ సంఘం సభ్యులు అందరూ ఆమెను తొలగించాలని నిర్వహించిన సమావేశంలో చేతులెత్తామన్నారు.

అదేవిధంగా తీర్మాణ పుస్తకంలో సంఘం సభ్యులు ఆమెను తొలగించాలని తీర్మానం చేసి సంతకాలు కూడా చేశామన్నారు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు వివోఏఎన్ తొలగిస్తామని హామీ ఇచ్చి వెళ్లినారన్నారు. విచారణ అయిపోయిన మరుసటి రోజు నుండి ఆమెకు వ్యతిరేకంగా చేతులు లేపిన వారిపై వివోఏ ముత్యాల సరిత రాజకీయ అండదండలతో పాటు ఇన్చార్జి సిసి గోపి సహకారంతో సంఘం సభ్యురాలు అందరిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ పదేపదే హెచ్చరిస్తూ కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈమె గత సుమారుగా ఆరు సంవత్సరాల నుండి సంఘం అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఐకెపి సెంటర్లో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు చూపించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. సంఘం సభ్యులుగా ఎన్నుకోవడం అందరి సమక్షంలో జరుగుతున్నప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఆమెకు నచ్చిన వ్యక్తిని ఎటువంటి తీర్మానం లేకుండా కార్యదర్శి అని తీర్మానం బుక్కులో ఎక్కించి తీర్మాన షరతులను ఉల్లంగించిందని పేర్కొన్నారు.

అదేవిధంగా గ్రామ ప్రజా ప్రతినిధి, సిసి గోపి  అండదండలతో సభ్యులకు తెలవకుండా ప్రభుత్వం నుంచి వచ్చే కోడిపిల్లళ్లను తీసుకువచ్చి సంఘం సభ్యులకు తెలవకుండా ఒక్కొక్క పిల్లను 110 రూపాయలకు అమ్ముకొని సంఘం సొమ్మును దుర్వినియోగం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముత్యాల రవి పడిదెల లింగయ్య రైతులు ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి కాంటాలు వేయించుకొని బస్తాలు లెక్కపెట్టి దిగుమతికి పంపారన్నారు. ఈ దిగుమతి ట్రక్ సీట్లో బస్తాలు తక్కువ వచ్చాయని ఆ రైతులకు చెప్పడంతో బాధకు గురైన రైతులు వచ్చి వివోఏ ను అడగగా వారిపై అక్రమ కేసులను పెట్టి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నా యని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా వివో ఏ ముత్యాల సరితపై అధికారులు చర్యలు తీసుకొని వివోఎ గ తొలగించాలని కోరుకుంటున్నామన్నారు.