25 March, 2026 | 5:17 PM

మాజీ ఎమ్మెల్యే జన్మదినం.. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

25-03-2026 03:43 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ముద్దుబిడ్డ నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలు సందర్భంగా తాండూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు,అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆయురారోగ్యాలతో జీవించి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాలని నల్లమడుగు సురేందర్ భారీ మెజార్టీతో గెలవాలని దీవించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.