calender_icon.png 24 December, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి

31-07-2024 11:09:19 AM

మంథని(విజయక్రాంతి): ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని మంథని సీఐ రాజు తెలిపారు. మంథని బస్టాండ్  లో ఆటో డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్లు పాటించవలసిన జాగ్రత్తలు వారికి కేటాయించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. రోడ్లమీద ఆటోలో నిలిపి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంలు రానియద్దన్నారు. ఆటో నెంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని, ఆటోలో ఎక్కిన ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో మర్యాదగా ప్రవర్తించాలని వారికి నమ్మకం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. ముత్తారం మండల కేంద్రంలోని కాసర్లగడ్డలో ప్రజలకు శాంతి భద్రతల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ఎస్సై మధుసూధన్ రావు. మంథని ఏఎస్సై మల్లయ్య గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.