ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం
17-03-2026 04:58 PM
మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం మండల వైద్యాధి కారి భవాని తెలిపారు. మండల కేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక డాక్టర్ల బృందం పిజీషియన్, జనరల్ మెడిసిన్, అర్దోపేటిక్, పిల్లల వైద్యులు, పిడియాట్రిక్స్ కంటి వైద్యలు, డెంటల్, ప్రసూతి గైనకాలజీ విభాగాల వైద్యులు, పాల్గొని రోగులకు చికిత్స అందిస్తారని రోగులకు అవసరాల నిమిత్తం వివిధ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మండలంలోని ప్రజలు ఈ హెల్త్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య పరీక్షలకు వచ్చే వారు తమ ఆధార్ కార్డుతో రావాలని కోరారు.




