ఆగస్టు 24న ఆటోలు బందును జయప్రదం చేయండి
కంచర్ల జమలయ్య
కొత్తగూడెం,(విజయక్రాంతి): గురువారం స్థానిక శేషగిరి భవన్లో ఆటో కార్మికుల జిల్లా సన్నాక సమావేశంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, కంచర్ల జమలయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ తర్వాత మరో మరో రంగమే ఆటో కార్మికులు, లక్షలాది మందికి ప్రజలకి రవాణా సౌకర్యం కల్పిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా ఉపాధి కోసం అప్పులు చేసి ఆటోలు నడుపుతూ, మారుమూల గ్రామాల ప్రజలకు సైతం, రవాణా సౌకర్యం కల్పిస్తుంది.
ఆటో రంగమే, లక్షలాదిమంది ఆటోలు ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబాలను పోషించుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, అన్ని కార్మిక సంఘాలతో పలు సమస్యలపై సమావేశం కావటం జరిగింది. ఆ సందర్భంగా మ్యానిఫెస్టో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి, 12000, సంక్షేమ బోర్డు హామీ లు ఇచ్చి గద్దెనెక్కింది.
కానీ ఈనాటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న, హామీలు నెరవేర్చలేదు, ఆటో కార్మికుల్ని మోసం చేసింది. పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రములో ఆటో డ్రైవర్లకి 12000 అమలు చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో కార్మిక సంఘాలను, చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, అబ్బులు, దేశి ఆర్యకృష్ణ బడుగు భాస్కర్, బాబు జానీ, వెంకట్ గాప్రేలు గౌస్ సత్యనారాయణ, విజ్జి కిరణ్ ముక్కెర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






