20 August, 2026 | 6:58 PM

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘననివాళులు

20-08-2026 06:23 PM

నర్సాపూర్: హత్నూర–నర్సాపూర్ మండలాల్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజక వర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఆధునికీకరణ, యువత సాధికారతకు రాజీవ్ గాంధీ చేసిన సేవలను  స్మరించుకున్నారు.

రాష్ట్రం లో కొనసాగుతున్న ఎస్.ఐ. ఆర్, ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, 18 ఏళ్లు నిండిన యువతతో ఫారం-6 దరఖాస్తులు నింపించారు. అర్హులైన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, నర్సాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేశం, హత్నూర మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, మైనార్టీ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి హకీమ్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ దుర్గా రెడ్డి, సర్పంచులు శ్రీహరి, పోచ గౌడ్, వెంకటేశం, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు రాజేందర్, మాజీ సర్పంచ్ వెంకటేశం, కిష్టయ్య, నవీన్ కుమార్, సాయికుమార్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, పైడి శ్రీధర్ గుప్తా, కార్యకర్తలు, పాల్గొన్నారు.