ఆధునిక నవభారత పితామహుడు రాజీవ్ గాంధీ
ఆధునిక నవభారత పితామహుడు రాజీవ్ గాంధీ
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు20: ఆధునిక నవభారత పితామహుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి అన్నారు.మాజీ ప్రధాని,భారతరత్న,స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం ఆ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్ తో కలిసి రాజీవ్ గాంధీ చితపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. భారత సాంకేతిక రంగాల్లో టెలీ కమ్యూనికేషన్, విద్య, ఆర్థిక రంగాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య, మాజీ జెడ్పీటీసీ అవిలయ్య, ఏఎంసీ డైరెక్టర్లు సైదులు, జలెంధర్, సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, లూనావత్ కృష్ణనాయక్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు వెంకటేష్, లింగస్వామి, వజ్జె వీరయ్య, కేసాని రాహుల్, విక్రం,మహేష్, సత్యం, మనోహర్, కోటిప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.






