ముకరంపురలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
ముకరంపురలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
ముకరంపుర, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం కరీంనగర్ లోని రాజీవ్ చౌక్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, పలువురు నాయకులతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి, రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు.
అనంతరం టిపిసిసి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ స్ఫూర్తితో సర్ ప్రక్రియలో భాగంగా డిసిసి మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ 18 సంవత్సరాలు నిండిన యువతకు నూతన ఓటరు నమోదు ఫారం 6 స్వయంగా పూరించి అందజేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి డా. మేడిపల్లి సత్యంతో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.






