జల వనరుల పరిరక్షణ పై దృష్టి సారించండి
20-08-2026 06:38 PM
జల వనరుల పరిరక్షణ పై దృష్టి సారించండి
బోథ్. ఆగస్టు 20 ( విజయ క్రాంతి): జల వనరుల పరిరక్షణపై రైతుల దృష్టి సారించాలని ఎంపీడీవో ఎల్ రమేష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని జీడిపల్లి గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకుంటున్న ఫారం ఫండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం లోటు ఉండటంవల్ల నీటి వనరులను పరిరక్షించు ఉంటేనే భావితరాలను నీటి ఎద్దడినుండి కాపాడుకోవచ్చు అన్నారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్క రైతు ఫారం పండ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేగాక బోర్ల సమీపంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.






