14 June, 2026 | 4:24 PM

Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •  

అందుబాటులో యూరియా: కలెక్టర్

30-12-2025 01:44 AM

రంగారెడ్డి,డిసెంబర్ 29( విజయక్రాంతి ): రంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లావ్యాప్తంగా యూరియా సరఫరా పూర్తిస్థాయి లో కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా యూరియా పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రైతులకు స్పష్టంగా కనిపించే విధంగా స్టాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. విక్రయ కేంద్రాలకు యూరియా సరఫరా తగినంతగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా అంతరాయం లేకుండా స్టాక్ను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు.యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతామని తెలిపారు.