గురుకులాల్లో చేరి విజేతలుగా నిలవాలి
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,డిసెంబర్29:ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో చేరి విద్యావంతులై విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గా ను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో 5 వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9 తరగతుల ఖాళీలకు సైనిక్ స్కూల్, ఫైన్ ఆరట్స్ పాఠశాలల్లో వివిధ తరగతుల ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
దరఖాస్తులను https://tgcet.cgg.gov.in వ్బుసైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని, చివరి తేదీ జనవరి 21, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న జరుగుతుందని, సర్టిఫికెట్ల త్వరిత జారీ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
యువత ఉపాధికి పరిశ్రమలు కీలకం : జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,డిసెంబర్29:సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప రిశ్రమల స్థాపన కీలకమని తెలిపారు. టీజీ ఐపాస్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలు పూర్తిస్థాయిలో పరిశీలించి, యూనిట్ ఏర్పాటు చేయని దరఖాస్తులను డిలీట్ చేయాలని ఆదేశించారు.
అన్ని పరిశ్రమల్లో కార్మికులకు తప్పనిసరిగా ఇన్స్యూరెన్స్ కల్పించాలన్నారు. అలాగే ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు తరచూ తనిఖీలు నిర్వ హించాలని, ఎక్కువ మంది కూలీలు పనిచేసే పరిశ్రమల్లో సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేష్రామ్, ఎల్డీఎం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.






