ఉత్సాహంగా అవంతిక తెలంగాణ రన్
హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో నింపుతూ, ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న అవంతిక తెలంగాణ రన్ 2026 నెక్లెస్‌రోడ్ దగ్గర ఉత్సాహంగా సాగింది. సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్‌లో హాఫ్ మార థాన్, 10కె రన్, 5కె రన్, 2కె రన్ విభాగా ల్లో వేలాది మంది రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణలో ఫిట్‌నెస్, ఆరోగ్యం, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే ల క్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వి శేష స్పందన లభించింది.తెలంగాణలో వేగం గా అభివృద్ధి చెందుతున్న రన్నింగ్ ఉద్యమాన్ని అవంతిక కన్స్ట్రక్షన్ గ్రూప్ ఎండీ యన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్ర మాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ రన్నర్స్ చేపడుతున్న కా ర్యక్రమాలకు తమ వంతు సహకారం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రన్నింగ్ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ నిరంతరం కృషి చేస్తోందనీ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ మగ్గారి , ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడ్వన్ హాస్పిటల్స్ సీఈఓ డా. మంజునాథ్ పాల్గొని రన్నర్లను అభినందించారు.






