8 June, 2026 | 1:45 AM

తిలక్ వర్మకు రికార్డు ధర

08-06-2026 12:23 AM

రూ.33 లక్షలకు కొన్న మెదక్ ఫాల్కన్స్

వరంగల్ వారియర్స్‌లోకి సిరాజ్

టీజీ20 లీగ్ వేలం

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు సం బంధించి ఆటగాళ్ల వేలం ఉత్సాహంగా సాగింది. 1,300 మందికి పైగా ఆటగాళ్ల వేలం లో పాల్గొనగా ఐకాన్, ఏ+, ఏ కేటగిరీల్లో తెలంగాణకు చెం దిన అంతర్జాతీయ స్టార్లు, దేశవాళీ క్రికెటర్లు, జిల్లాల ప్రతిభావంతులైన కుర్రాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.

ఐకాన్ ప్లేయర్స్‌లో భారత స్టార్ క్రికెటర్ తిలక్ వర్మకు లీగ్‌లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ’మెదక్ ఫాల్కన్స్’ జట్టు రూ.33 లక్షల భారీ ధరకు తిలక్‌ను సొంతం చేసుకుంది. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది. అన్‌క్యాప్డ్ విభాగంలో సీవీ మిలింద్ రూ.17 లక్షల అత్యధిక ధరకు అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు కొనుగోలు చేసింది.

దేశవాళీ క్రికెట్‌లో గుర్తిoపు ఉన్న ఇతర ఐకాన్ ప్లేయర్లలో రవి కిరణ్ (పాలమూరు స్ట్రైకర్స్), టి. రవితేజ (మెదక్ ఫాల్కన్స్), తన య్ త్యాగరాజన్ (ప్రణవ రంగారెడ్డి రైజర్స్), రాహుల్ బుద్ధి (అనురాగ్ నల్గొండ నైట్స్), తన్మయ్ అగర్వాల్ (కరీంనగర్ డైమండ్స్), రోహిత్ రాయుడు (పాలమూరు స్ట్రైకర్స్) కూడా ఐకాన్ కేటగిరీలో మంచి ధరకు అమ్ముడయ్యారు. మ్యాచీ ప్లేయర్ల కోర్ టీమ్ ను బలోపేతం చేసే ’ఏ+’ కేటగిరీలో అమన్ రావు (వరంగల్ వారియర్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (పాలమూరు స్ట్రైకర్స్), అజయ్ దేవ్ గౌడ్ (హైదరాబాద్ ఈ-చాంపియన్స్)తో పాటు నితిన్ సాయి యాదవ్, ఆరోన్ జార్జ్, రక్షణ్ రెడ్డిలను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.

యువ ఆటగాళ్లు ఉన్న ’ఏ’ కేటగిరీలోనూ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అర్ఫా జ్ అహ్మద్, అభిరత్ రెడ్డి చెరో రూ.11 లక్షల ధర పలికి ఈ విభాగంలో సంయుక్తంగా అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా నిలిచారు. వీరితో పాటు చందన్ సహాని (కరీం నగర్ డైమండ్స్), ప్రణవ్ వర్మ (హైదరాబాద్ ఈ-చాంపియన్స్), హిమ తేజ (అన్విత ఖమ్మం ఏసెస్) మంచి ధరకు అమ్ముడయ్యారు. కాగా టీజీ20 లీగ్ తొలి ఎడిషన్ ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.