8 June, 2026 | 1:40 AM

ఇంగ్లాండ్‌దే లార్డ్స్ టెస్ట్

08-06-2026 12:27 AM

లార్డ్స్, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ బౌలర్లు 140 పరుగులకే ఆలౌ ట్ చేశారు. అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. 27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెం డో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 226 పరుగులు చేయగలిగింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి చేతులెత్తేసింది.138 పరుగులకే ఆలౌటైంది.