calender_icon.png 2 September, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై కపటప్రేమను మానుకోండి

02-09-2025 12:34:38 AM

- కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల పక్షపాతిగా ఉంటుంది..

- 2 లక్షల వరకు రైతు రుణమాఫీ తో రైతుల చరిత్రలో నిలిచిపోయింది.

- సంగ స్వామి జిల్లా ఉపాధ్యక్షులు రాజన్న సిరిసిల్ల 

- మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) బీజేపీపై మాట్లాడే దమ్ము లేని బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. చెప్పిన మాట కేంద్రoలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పిదం వల్లే యూరియా కొరత ఏర్పడిందని చెప్తుంటే బారాస నాయకులకు కళ్ళు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ పక్షాన గెలిచిన శాసనసభ్యుడు రమేష్ బాబు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసి విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ ప్రాంత వెనుకబాటుకు కారణమైన సంగతి మర్చిపోయారా అని గుర్తుచేశారు...మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీ కేసీఆర్ ది కాదా అన్నారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి 18 మాసాలలో ఈ ప్రాంత అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంటే మింగుడు పడని మీరు యూరియాను అడ్డంపెట్టుకొని రైతులపెరిట రాజకీయ పబ్బం గడపడం మానుకోండి మండి పడ్డారు..మీ ప్రభుత్వ హయాంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసిన సంగతి,ఆరోజు లైన్లో నిలబడి రైతులు గుండెపోటుతో చనిపోయిన రైతులను పట్టించుకొని మీరా రైతుల గురించి మాట్లాడేదని అన్నారు.

ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ అభివృద్ధి చేస్తూ మర్రి పల్లి,కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, లచ్చంపేట చెరువు వంటి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు..బర్రెల,గొర్రెల,కాళేశ్వరం లో,లిక్కర్ పైన, ఈ కార్ రేస్ వంటి స్కాం లతో మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని,రాష్ట్ర ఖజానా మొత్తం ఇతర రాష్ట్రాల్లో చెక్కుల రూపంలో పంచిన ఘనుడు మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదా అని ప్రశ్నించారు.మీరు ఎన్ని రకాల రైతులను రెచ్చగొట్టిన మీ మాటలను నమ్మే రోజులు పోయాయని అన్నారు.

రానున్న ఎన్నికల్లో మీ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమన్నా రు.వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పుకొచ్చారు.ఇప్పటికైనా రైతులను రెచ్చగొట్టడo మానుకోవాలని కోరారు.వారి వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం,డైరెక్టర్ మానుపాటి పర్షరాములు,మాజీ ఉపసర్పంచ్ అక్కేన పెళ్లి నరేశ్ తదితరులు ఉన్నారు.