calender_icon.png 2 September, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

02-09-2025 12:35:28 AM

నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 

నాగల్ గిద్ద, సెప్టెంబర్ 1: నాగల్ గిద్ద మండలం ఔదత్ పూర్, గౌడ్ గామ, ఎస్గి, కరముంగి గ్రామాల రైతుల పంట పొలాలను, మంజీర నదిని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు వరి, పత్తి, పెసరు, మినుము తదితర పంటలు నీట మునిగి రైతులు చాలా నష్టపోయారని వారికి పంట నష్టపరిహారం ఒక ఎకరానికి ఊ.20,000 చెల్లించలని, అలాగే  ప్రతి వర్షాకాలం సింగూర్ నీటి ద్వారా ఈ గ్రామాల రైతులు పంట నష్టపోతున్నారని,

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.10,000 నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పండరి, మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు నందు పాటిల్, మాజీ సర్పంచ్ అశోక్ రావు పాటిల్, రాజు పాటిల్,మాజీ ఎంపిటిసి సంతోష్ పాటిల్, ఉమాకాంత్ బీరధర్, గుణవంత్ మాలిపాటిల్, విరిశెట్టి, ప్రహ్లాద్, రమేష్ వాడికర్ నాయకులు తదితరులు ఉన్నారు.