ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈఎక్స్ లాంఛ్ చేసిన అవోర్ ఎలక్ట్రిక్
అహ్మదాబాద్, 28 జూలై 2026:
అవోర్ ఎలక్ట్రిక్, సమర్థ్ ఇ-మొబిలిటీకి చెందిన భారతీయ స్వదేశీ సాంకేతికత-ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ, ఈ రోజు తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘అవోర్ ఎలక్ట్రిక్ ఈఎక్స్’ (అవోర్ ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ ఎక్స్‌పీరియన్స్)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈఎక్స్ 2S, ఈఎక్స్ 2 మరియు ఈఎక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోనున్న ఈ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1,24,999 (ఎక్స్-షోరూమ్). స్వదేశీ సాంకేతికత, అత్యాధునిక ఇంజినీరింగ్ మరియు రోజువారీ వినియోగానికి అనువైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ మోటార్‌సైక్లింగ్‌కు కొత్త నిర్వచనాన్ని అందించేలా ఈఎక్స్ ను పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేశారు.
అవోర్ ఎలక్ట్రిక్ ఈఎక్స్ ఆకాంక్షలను ప్రతిబింబించే, కాలాతీతమైన డిజైన్‌ను పరిచయం చేస్తోంది. భారతీయ రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోటార్‌సైకిల్, కేవలం సాంకేతికతలోనే కాకుండా రైడింగ్ భంగిమ, ఎర్గోనామిక్స్ మరియు మొత్తం యాజమాన్య అనుభవంలోనూ మోటార్‌సైకిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడాన్ని మరింత సహజంగా, సౌకర్యవంతంగా చేస్తుంది.ఈ మోటార్‌సైకిల్ తన ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ డిజైన్, సిగ్నేచర్ ట్యాంక్ లైట్లు, అలాగే మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రైడింగ్ మోడ్‌లతో సుపరిచితమైన మోటార్‌సైకిల్ అనుభూతిని అత్యాధునిక ఈవీ ఇంజినీరింగ్‌తో సమన్వయం చేస్తుంది.
రోజువారీ వినియోగ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మోటార్‌సైకిల్‌లో, సాధారణ గృహ విద్యుత్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేసుకునే వీలును కల్పించే ఫ్లెక్స్ ఛార్జ్, 1500W ఆన్‌బోర్డ్ ఫాస్ట్ ఛార్జర్‌ను అందించారు. అలాగే, అవోర్ ప్రత్యేకమైన సైడ్-బై-సైడ్ బ్యాటరీ ప్యాక్ ఆర్కిటెక్చర్ అయిన స్ప్లిట్ ప్యాక్ ఎనర్జీ, బ్యాటరీ ప్యాకేజింగ్, బరువు పంపిణీ మరియు థర్మల్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా ఆప్టిమైజ్ చేస్తుంది.
అదనంగా, PAM+ పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు తక్కువ వేగంతో వాహనాన్ని నడపడం మరియు పార్కింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. ఈ మైలురాయి వంటి ఆవిష్కరణ సందర్భంగా, శ్రీ ప్రియాంక్ రాఖోలియా, వ్యవస్థాపకుడు, అవోర్ ఎలక్ట్రిక్ మాట్లాడుతూ, "అత్యుత్తమ ఇంజనీరింగ్ మరియు ఆవిష్కరణలను అందించేందుకు, EXను విడుదల చేయడానికి ముందు మేము పరిశోధన, అభివృద్ధి, పరీక్ష మరియు ధృవీకరణ కోసం మూడు సంవత్సరాలు కేటాయించామన్నారు.. విశ్వసనీయత, స్థిరత్వం మరియు ఆర్థిక లాభదాయకతను అందించే, భారతదేశంలో అభివృద్ధి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ టెక్నాలజీల పరిధిని విస్తరిస్తూ, మేము ప్రపంచ స్థాయి భద్రత మరియు పనితీరును అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అవోర్ ఎలక్ట్రిక్ ఈక్స్ వచ్చే నెల నుంచి భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. అధికారిక అవోర్ ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు వెంటనే ప్రారంభమవుతాయి. ఈక్స్ 2S, ఈక్స్ 2, ఈక్స్ 1 అనే మూడు వేరియంట్లలో లభించే ఈ మోటార్‌సైకిల్‌కు బుకింగ్‌లు కేవలం రూ. 799 నుంచే ప్రారంభమవుతాయి. కస్టమర్లకు డెలివరీలు 2 నెలల తర్వాత ప్రారంభమవుతాయి.






