30 July, 2026 | 9:55 PM

ఎస్సారెస్పీలోకి భారీ వరద

30-07-2026 09:21 PM

 - 75 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఆర్మూర్,(విజయక్రాంతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి  ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలో,  ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1067.00 అడుగులకు 18.71 టీఎంసీల నీరు నిలువ ఉంది.

గత ఏడాది ఇదే రోజున 1077.10 గాను 38.79 టిఎంసిల నీరు నిలువ ఉండింది. ఉదయం  ఆరు వేల క్యూసెక్కుల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు 80వేల క్యూసెక్కుల వరకు వరద క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎనిమిది గంటలకు తొమ్మిది వేల క్యూసెక్కులు, 10 గంటలకు10 వేలు, 12 గంటలకు 13 వేలు, మధ్యాహ్నం రెండు గంటలకు 20 వేల క్యూసెక్కుల వరద పెరుగుతూ వచ్చింది.

నాలుగు గంటలకు 35 వేల క్యూసెక్కులు, నాలుగు గంటలకు 48 వేల క్యూసెక్కులు, ఆరు గంటలకు 72 వేల క్యూసెక్కులు, ఏడు గంటలకు 70 వేల క్యూసెక్కులు, ఎనిమిది గంటలకు 75 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 751 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 250 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 108 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.