30 July, 2026 | 9:55 PM

బోధన్ సీనియర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

30-07-2026 09:24 PM

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ ఫోటోల రేట్ల పెంపు

బోధన్,(విజయక్రాంతి): బోధన్ సీనియర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో స్టూడియోల్లో అందించే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (PP Size), మొబైల్ ఫోటోల ధరలను పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. పేపర్, ప్రింటింగ్ మెటీరియల్, కలర్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కొత్త ధరల ప్రకారం 8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల ధర రూ.100, 16 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోల ధర రూ.150, అలాగే మొబైల్ ఫోటో ప్రింట్ ధర రూ.50గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

పెరిగిన ముడిసరుకు ధరలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు అర్థం చేసుకుని సహకరించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మురళి కటికల, ఉపాధ్యక్షుడు శంకు గణేష్, కార్యదర్శి సోముల అనిల్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎర్ర శ్రీకాంత్, క్యాషియర్ ఉమాకాంత్, మాధవ్, గౌరవ అధ్యక్షులు అనిల్ గౌడ్, అశోక్, పాండు, ప్రభాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.