30 August, 2026 | 12:17 PM

నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి

30-08-2026 11:12 AM

ఇబ్రహీంపట్నం,అగస్టు30 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగూడ నీట్ పీజీ  పరీక్ష కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి మద్యం సేవించి పరీక్షకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ​పరీక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా, అతను మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అధికారులు అతన్ని పరీక్ష రాయకుండా బయటకు పంపించివేశారు. సదరు విద్యార్థిని హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.