30 August, 2026 | 1:53 PM

గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలి

30-08-2026 11:32 AM

కొల్లాపూర్ రూరల్ : నాగర్‌ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వేడుకరావుపల్లి తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ మంగమ్మ అమ్రు నాయక్, ఉప సర్పంచ్ గన్నోజు రామోహన్‌తో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వారి కష్టాలను తీర్చిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, పేర్లు రాసి పెట్టుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.