యువత సైబర్ మోసాలకు గురి కావద్దు
- బ్యాంక్ ఖాతా నెంబర్, ఎటిఎం కార్డ్, ఓటీపీ వివరాల గొప్యత పాటించాలి.
- షీ టీమ్స్, సైబర్ నేరాలపై అవగాహనలో హెడ్ కానిస్టేబుల్ మురళి చారి.
నేరేడుచర్ల,(విజయక్రాంతి): ప్రతి పాఠశాల,కళాశాలలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దని,బ్యాంక్ ఖాతా నెంబర్,ఎటిఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దని, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని, మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురళి చారి అన్నారు.
నేరేడుచర్ల మండలం కేంద్రం లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్బంగా నేరేడుచర్ల హెడ్ కానిస్టేబుల్ మురళిచారి మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు కోరారు.
సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని,అలాగే వేధింపులపై100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే కోదాడ షీ టీం ఫోన్ నెంబర్ 8712686056కి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో అవగాహన కల్పించారు.






