19 May, 2026 | 4:20 PM

ఇల్లెందు ఏరియా ఆసుపత్రులలో ఉద్యోగులకు అవగాహన

19-05-2026 03:47 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్, ఏరియా హాస్పిటల్‌ లలో ఉద్యోగులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో “మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య, ఎస్.ఓ. టు జి.యం  డి. రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, యంత్రాల సమర్థ వినియోగం, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, ప్రమాద రహిత పని విధానం వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అలాగే సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై వివరించారు.

యంత్రాల పని గంటలు పెంచి సంస్థ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. అలాగే ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ, భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సేవలు, పరిశుభ్రత, వైద్య సదుపాయాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఉద్యోగుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించి వాటిని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు అలాగే మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ కే.ఓ.సీ నందు ఉద్యోగులకి అవగాహన కల్పించామని తదుపరి ఉద్యోగుల నుండి ఈ కార్యక్రమానికి సంభందించిన సలహాలు సూచనలు తీసుకున్నారు.