సైబర్ మోసాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని కేజీబీవీ విద్యార్థినులకు ఆన్లైన్ మోసాలు,లైంగిక దోపిడీ, బెదిరింపులు ఆర్థిక మోసాలు నుండి రక్షణ, ఇంటర్నెట్ దుర్వినియోగం అనే అంశాల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలల సంరక్షణ అధికారి వోస శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత ఫొటో లు, సమాచారం సామాజిక మాధ్యమాలలో పంచుకోరాదని అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్ లు, సందేశాలకు బదులు ఇవ్వకూడదని పాస్వర్డ్ లు ఇతరులతో పంచుకోరాదని అనుమానాస్పద కాల్స్ మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ మోసాలకు పాల్పడిన బెదిరింపులకు పాల్పడిన జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1 9 3 0 కి లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ ఓ సుజాత చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త గంగాధర్ కేజీబీవీ ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది గణేష్ తదితరులు పాల్గొన్నారు






