అల్ఫోర్స్‌లో ఘనంగా జాతీయ విద్యా విధానంపై అవగాహన సదస్సు
కరీంనగర్, ఆగస్ట్10(విజయక్రాంతి):ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాజంలో వెలువడుతున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందని, ఉపాధ్యాయులు వాటి పట్ల విశ్లేషణాత్మకంగా వ్యవహరించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్‌ఇ) లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ విద్యా విధానం పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై వారు.
సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యా విధానం పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలని విద్యా విధానంలో చోటు చేసుకునేటువంటి మార్పులకు అనుగుణంగా బోధించాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం విద్యావిధానాన్ని సులభతరంగా చేయడానికి ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందని విద్యా వ్యవస్థను పటిష్ట పరచడానికి ఇది చాలా ఉపకరిస్తుందని తెలిపారు విద్యా విధానంలో చోటుచేసుకునేటువంటి సమూల మార్పులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలను చాలా వ్యూహాత్మకంగా విశ్లేషణాత్మకంగా నిపుణులతో చర్చించిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
విద్యార్థులకు అనువైన పద్ధతులలో బోధన అందించవలసిన అవసరం ఎంతగానో ఉందని ముఖ్యంగా సృజనాత్మకంగా కొత్త కోణంలో వారికి బోధించాలని చెప్పారు. కార్యక్రమానికి టి రిసోర్స్ పర్సన్స్ ఎన్.ఎస్.శ్రీనివాస్ , సంజీవ్ కుమార్ లు మాట్లాడుతూ విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులను ఉపాధ్యాయులకు తెలియజేయడానికై విషయాలను విశ్లేషణాత్మకంగా విద్యార్థులకు తెలియజేయడానికిసమాజంలో వెలువడుతున్న మార్పులు కనుగుణంగా ఉపాధ్యాయులు పలు అంశాల్లో శిక్షణ పొందాలని అన్నారు.
శిక్షణలో నేర్చుకున్నటువంటి విషయాలను తరగతి గదిలో సక్రమంగా అమలుపరచడమే కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే బాధ్యత సైతం తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీఎస్‌ఇ రిసోర్స్ పర్సన్స్‌ఎన్‌ఎస్‌శ్రీనివాస్,నాంపల్లి సంజీవ్,పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.






