రైతులకు అవగాహన
కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): జిల్లా ఉద్యాన, పట్టు కామారెడ్డి జిల్లా పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో భిక్కనూర్ మండ లం జంగంపల్లి రైతువేదికలో సోమవారం రైతులకు మల్బరీ, పట్టు పురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్త వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సెంట్రల్ స్కిల్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేంద్రరావు మల్బరీ సాగులో వంగడాల ప్రాముఖ్యతను తెలిపారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి పద్ధతిని అవలంబిచాలని తెలిపారు. మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక సహాయకు లతో గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీని రైతుతు సద్వినినియోగం చేసుకోవాలని కోరారు. మల్బరీ సాగులో అధిక దిగుబడి సాధించిన రైతు హర్షాద్‌ను ఈ సందర్భంగా శాస్త్రవేతలు సన్మానించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా సెరికల్చర్ అధికారి ఐలయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేందర్‌రావు పాల్గొన్నారు.






