రైల్వే సమస్యలను పరిష్కరించండి
కేంద్రమంత్రికి ఎంపీల వినతి
ఖమ్మం, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని కోరుతూ ఢిల్లీలో సోమవారం బీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడు సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు నేతృత్వంలో కేంద్ర మంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు.
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి హైదరాబాద్‌కు కొవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను నడపాలని కోరారు. తిరుపతికి కూడా రైలు నడుపాలని కోరారు. గాంధీపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్‌పాం ఎత్తు పెంచి, ఆధునీకరించాలన్నారు. కారేపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు రిజర్వేషన్ కౌంటర్‌ను పునరుద్ధరించాలని కోరారు.






