గెలుపు పై ద్రుష్టి పెట్టండి
బూత్ ఇంచార్జులే ముఖ్య భూమిక పోషించాలి
కాంగ్రెస్ 420 హామీల గురించి ప్రజల్లో అవగాహన కల్పించండి
మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
షాద్‌నగర్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో SIR ఓటర్ల సవరణపై అవగాహన సదస్సు
షాద్ నగర్, జూన్ 17 (విజయక్రాంతి): బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముకలాంటివారని, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి పాత్ర కీలకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాబోయే ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.ప్రతి బూత్‌లో పార్టీ బలాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యర్యంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బిఎల్ఎలు) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. యువత, మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపాదిత తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించి, ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా తొలగించబడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో అందజేసిన బిఎల్ఎ హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా అధ్యయనం చేసి, చట్టపరమైన నిబంధనలు, ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలను అవగాహన చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దపు 420 హామీలను ప్రజల్లో తీసుకెళ్లలాని అన్నారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ అబద్దాలకు ప్యాంటూ షర్ట్ తోడిగితే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్టు ను ఆపింది కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి ఆందోళన చేసిన విషయం నిజం కదా అసలు లక్ష్మిదేవిపల్లి ని తీసుకొచ్చిందే కెసిఆర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామనడం హాస్యాస్పదం అని ముందుగా వారిని లక్షధికారులను చేయాలనీ అన్నారు.ఈ అవగాహనా సదస్సు లో బిఆర్ఎస్ సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






