17 June, 2026 | 5:42 PM

శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు

17-06-2026 04:11 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు, సందర్భంగా నేరేడుచర్లలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి కొలచిన. దిలీప్ కుమార్ వేదమంత్రాలతో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అనంతరం విశేష పంచామృత అభిషేకాలు నీరాజనం మంత్రపుష్పం పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి, తాటికొండ వెంకటరెడ్డి, భువనగిరి అంజయ్య,జెట్టి వెంకన్న, చింతకుంట్ల శ్రీనివాస్, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, మర్రు శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.