17 June, 2026 | 5:44 PM

"అక్షరాభ్యాసంతో విద్యాప్రస్థానానికి శ్రీకారం"

17-06-2026 03:25 PM

విద్యారంభానికి తొలి అడుగుగా చిన్నారుల చేత అక్షరాలను దిద్దిస్తూ, విద్యా ప్రస్థానానికి శుభారంభం పలికిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అక్కన్నపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

రామాయంపేట, జూన్ 17 (విజయక్రాంతి): అక్కన్నపేట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కయ్యగారి యాదగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొని విద్య ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యార్థుల భవిష్యత్ ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.