ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి
* కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తా...
ఉట్నూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలోని మైసం పేట్, రాంపూర్ గ్రామాల ఆదివాసులకు న్యాయం చెయ్యాలని ఐటిడిఏ మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు ఐటిడిఏ పిఓ మంద మకరందుకు వినతి పత్రం అందజేశారు. బుధవారం బాధిత ఆదివాసులతో ఐటిడిపిఓను కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోయం బాపూరావు ఐటిడిఏ పిఓతో మాట్లాడుతూ... నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుం పూర్ పంచాయితీ పరిధిలోని మైసం పేట్ పునరావాస గ్రామస్తులకు వ్యవసాయ భూములు హద్దుల విషయంలో ఘర్షణలో ఆదివాసుల పై ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా మహిళలు అని చూడకుండా కళ్ళతో తన్నడం సరైంది కాదని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫారెస్ట్ అధికారులు కావాలనే ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్నరని, అమాయక ఆదివాసులపై దాడులు చేస్తున్నారన్నారు. దాదాపు 20 మంది ఆదివాసులకు అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కుటుంబ సభ్యులకు సైతం చెప్పడం లేదన్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోని న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. గత 30 సంవ్వస్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు కక్ష పూరీతంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు.
గత సంవత్సరం సైతం రిజర్వ్ టైగర్ జోన్ పేరుతో ఆసిఫాబాద్ జిల్లాలో వందల ఆదివాసీ గ్రామాలను తరలించే ప్రయత్నం చేసారని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఆదివాసుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.గ్రామస్తులు మాట్లాడుతూ... గత రెండు నెలల ముందే అధికారులు హద్దులు చూపించి మళ్ళీ తమ భూముల్లో వచ్చి ఆదివాసులకు చిచ్చు పెడ్తున్నారని పివో దృష్టికి తీసుకెళ్లారు. దింతో సానుకూలంగా స్పందించిన పివో మంద మకరందు మాట్లాడుతూ... తను అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
* కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులపై అడవి శాఖ అధికారుల దౌర్జన్యంతో పాటు వారికి సహకరిస్తున్న పోలీస్ శాఖ పై కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తానని మాజీ ఎంపీ రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఉట్నూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో టైగర్ జోన్ పేరుతో ఆదివాసులపై అడవి శాఖ అధికారులు దాడులు చేస్తుంటే వారికి పోలీస్ శాఖ సైతం వత్తాసు పలుకుతుందని అన్నారు.
కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్తామని అన్నారు. ఆదివాసుల సమస్యలతో పాటు అడవి శాఖ అధికారుల దౌర్జన్యాలు ఆగకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆయనతోపాటు రాజ్ గోండు సేవాసమితి ప్రధాన కార్యదర్శి విశ్వంభరావ్, నిర్మల్ జిల్లా రాజ్ గోండు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆత్రం భగవంతురావు, నిర్మల్ జిల్లా రాయి సెంటర్ల జిల్లా మేడి తొడుసం భీమ్ రావు ల తో పాటు కినకా తులసిరామ్, లచ్చన్న ఎల్లాపూర్ , మైసంపేట గిరిజనులు , మహిళలు పాల్గొన్నారు.






