17 June, 2026 | 5:54 PM

వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత

17-06-2026 04:17 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మురికి కాలువల పూడికతీత పనులను, పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. గ్రామంలో ఆరు నెలలకు ఒకసారి ఊరికి కాల్వల పూడికతీయుట పనులను చేపట్టడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, సూపర్ సర్పంచ్ కండే శ్యామల, కార్యదర్శి అశోక్,గ్రామస్తులు ఉన్నారు.