21 July, 2026 | 8:44 PM

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

21-07-2026 06:07 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని 21వ డివిజన్ వికలాంగుల కాలనీలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.19 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... వికలాంగుల కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందన్నారు.